పసిపాపే దైవం... ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

parents decided donate baby's organs
కేరళకు చెందిన షరీన్ అబ్రహం అనే ఈ పది నెలల పసిపాప రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఎంతో బాధగా ఉన్నప్పటికీ వాళ్ల తల్లిదండ్రులు ఆ పాప ఆర్గాన్స్ డొనేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ విషయం కేరళ ప్రభుత్వానికి తెలిసి ఎంతో ఆశ్చర్యపోయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలి అని నిర్ణయించారు. నిజంగా ఆ పాప మరో ఆరు మంది ప్రాణాలను కాపాడింది. మనదేశంలో నూరు మందికి ఆర్గాన్స్ కావాల్సి ఉంటే కేవలం ఇద్దరికీ మాత్రమే దొరుకుతున్నాయి. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం.
మా కర్నూలు ఆసుపత్రిలో కూడా తాను ఒక ఆర్గాన్ డొనేషన్ను విజయవంతంగా చేయించగలిగాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్గాన్ రిట్రైవ్ చేయడము అనేది మొట్టమొదటిసారిగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేసాము. తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్ డెత్ కేసులో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరిని మనము జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేస్తే ఎక్కువ మందికి ఆర్గాన్స్ దొరుకుతాయి. చనిపోయాక శరీరం కాలిస్తే బూడిదవుతుంది మట్టిలో వేస్తే మట్టి అయిపోతుంది కాబట్టి చాలామంది బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వెంటనే ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తే చాలామందికి జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు.
మీరేమంటారు?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ MS MCh
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
-
Home
-
Menu
