మనిషా?.. మృగమా?.. తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసి..

Woman died after Clash with UP Police
X

Woman died after Clash with UP Police

బెంగళూరు: ఓ వ్యక్తి తన కన్న తల్లిదండ్రులతోపాటు సొంత సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఈ భయంకరమైన కుటుంబ మారణహోమం కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని విజయనగర్ జిల్లాలో జనవరి 27(మంగళవారం)న ఈ దారుణ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొత్తూరులో అద్దె ఇంట్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులు భీమ్‌రాజ్, జయలక్ష్మి, సోదరి అమృతను అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. హత్య చేసి, వారి మృతదేహాలను అద్దె ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత బెంగళూరుకు పారిపోయిన నిందితుడు అక్షయ్.. తన మీద అనుమానం రాకుండా.. తల్లిదండ్రులు, సోదరి కనిపించకుండా పోయారని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదును చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

అమృతకు ఒక యువకుడితో ఉన్న ప్రేమ సంబంధంపై కుటుంబంలో వివాదం తలెత్తింది. అమృత ప్రేమను అక్షయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, తల్లిదండ్రులు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించగా.. కోపంతో రెచ్చిపోయిన అక్షయ్.. ముగ్గురినీ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మృతదేహాలను పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించడానికి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించేందుకు, సంఘటనల క్రమాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story