బుమ్రాకి పార్ట్‌నర్‌గా అతడు బౌలింగ్ చేయాలి: పార్థివ్ పటేల్

భారత్-దక్షిణాప్రికా మధ్య మరికొన్ని గంటల్లో తొలి టి-20 మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి పలు సూచనలు చేశాడు. బుమ్రా సేవల్ని జాగ్రత్తగా వాడుకోవాలని అన్నాడు.
‘‘నేను కొన్ని విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను? అందులో ఒకటి భారత జట్టు బుమ్రా సేవల్ని ఎలా ఉపయోగించుకుందా అని. ఆసియా కప్ నుంచి టీం ఇండియా బుమ్రాతో పవర్‌ప్లేలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేయిస్తోంది. దీని వల్ల అతడు చివర్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అందుకే భారత జట్టు అతడి బౌలింగ్‌ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ మ్యాచ్ ప్రారంభంలోనే అతడితో మూడు ఓవర్లు బౌలింగ్ చేయిస్తే.. డెత్ ఓవర్‌లో బుమ్రా పార్ట్‌నర్‌గా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు.
-
Home
-
Menu
