దేశద్రోహులను కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది: రాంచందర్ రావు

X
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హిందూవులపై దాడులు జరగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ను గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర బిజెపి మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దేశద్రోహులను కాంగ్రెస్ పెంచి పోషిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని రాంచందర్ రావు మండిపడ్డారు.
Next Story
-
Home
-
Menu
