పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan
X

మంగళగిరి: జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. జాగ్రత్తా! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైకాపా నేతలు ప్రచారం చేస్తారు’’ అని పవన్ అన్నారు.

Tags

Next Story