నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు: పవన్

Pawan Kalyan speech in pitapuram
అమరావతి: పిఠాపురంలో తనని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురాన్ని దేశంలో నెంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పిఠాపురం నిండుగా..అభివృద్ది పండుగ కార్యాక్రమంలో భాగంగా ఆర్ఆర్ బిహెచ్ఆర్ మైదానంలోజరిగిన జనసేన సభలో పవన్ ప్రసంగించారు. తన విజయానికి సపోర్ట్ చేసిన టిడిపి, బిజెపి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపారు. తనని గెలిపించి బలమైన ప్రయాణానికి నాంది పలికారన్నారు. గెలుపు, ఓటమి గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్య చాలా కీలకమైనదని, శాశ్వత పరిష్కారానికి రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్ర అనుమతులు సాధించామని వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి వేగంగా పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. పిఠాపురంలో రూ.1,500 కోట్ల అభివృద్ది పనులకు పవన్ శ్రీకారం చుట్టారు. పిఠాపురంలో రూ.34 కోట్లతో ఆలయాల అభివృద్ది. పిఠాపురం టిటిడి సహకారంతో భజన మందిరాల నిర్మాణం, రూ.2 కోట్లతో కుంతీ మాధవ స్వామి ఆలయ కోనేరు పునరుద్ధరణ చేస్తామని, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పిఠాపురంలో రూ.225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మానిస్తామని పవన్ తెలిపారు. రోజుకు 72 లక్షల లీటర్ల సామర్ధ్యంతో 2 ఎస్ టీపీల నిర్మాణం,40 టన్నుల తడి చెత్త శుభ్రం చేసే ప్లాంటు,ఐదుచోట్ల పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. పిఠాపురంలో డంప్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు.
-
Home
-
Menu
