‘ఎందుకో అంత క్యూట్‌గా?’ ప్రభాస్‌పై ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ కామెంట్స్

Prabhas, Payal Rajput
X

రెబల్‌స్టార్ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. అభిమానులంతా ‘డార్లింగ్’ అంటూ ప్రభాస్‌ని ప్రేమగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంతటి పవర్‌ఫుల్ రోల్స్ చేసినా.. బయట మాత్రం చాలా సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు. అయితే ప్రభాస్‌ అంటే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అందులో ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ఆమె తాజాగా ఎక్స్‌లో వేసిన ఓ పోస్ట్ చూస్తే తెలుస్తోంది.

ప్రభాస్ ఇటీవల జపాన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ఆయన జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ పోస్ట్ చేసిన పాయల్.. ‘‘ఇంత అమాయకంగా ఎవరైనా ఉండగలరా? ఇండస్ట్రీ మనల్ని కఠినంగా మార్చుతుంది. అంతేకాక.. మంద చర్మం గత వారిలా చేస్తుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం సులువుగా సిగ్గుపడుతుంటారు.. దాంతో ఎక్కువ మాట్లాడలేరు. ఎందుకు అంత క్యూట్‌గా ఉంటాడో? దేవుడు అతడిని దీవించుగాక’’ అంటూ ప్రభాస్‌ని పొగుడుతూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు ‘‘మీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Next Story