పెద్దపల్లిలో ఎసిబికి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు బ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కాడు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) డొంకెన రవీందర్ రూ.1.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా రవీందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. డొంకెన రవీందర్ పెద్దపల్లి జిల్లా కునారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, లంచం డిమాండ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags
-
Home
-
Menu
