వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. మూసీలో పడిపోయాడు..

వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. మూసీలో పడిపోయాడు..
X

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఓ యువకుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిమజ్జనాలకు మూసీ పాత వంతెన వద్ద అధికారులు ఏర్పాట్లు చేయగా.. కొందరు యువకులు నిర్లక్ష్యంగా పైవంతెన నుంచి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు విగ్రహంతో పాటు నదిలో పడిపోయాడు. అయితే అతడు క్షేమంగా బయటకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పై వంతెన వద్ద నిమజ్జనాన్ని అడ్డుకోబోయిన మున్సిపల్ అధికారులతో ఆ యువకులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags

Next Story