వైన్ షాప్ వచ్చింది...ఉద్యోగం ఊడింది

PET Teacher suspended
X

PET Teacher suspended

జిల్లా కేంద్రంలో వైన్ షాప్ దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఇఒ శనివారం సస్పెన్షన్ వేటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని 16వ నెంబర్ మద్యం షాపునకు ఇటీవల జరిగిన టెండర్లలో రామ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పిఇటిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూపాని పుష్ప పాల్గొన్నారు. ఆ టెండర్ల లక్కీ డిప్‌లో షాపు ఆమెకు దక్కింది. అయితే సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు టెండర్లలో పాల్గొనకూడదని కొంత మంది మద్యం షాప్ టెండర్‌ దారులు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో విచారణలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పుష్ప పాల్గొన్నట్టు రుజువైంది. దీంతో శనివారం సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Tags

Next Story