నల్గొండలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై

X
హైదరాబాద్: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్ భార్య మమత (25)తో అదే గ్రామానికి చెందిన వంపు సుజాత గొడవపడింది. వాగ్వాదం పెరిగి మమతపై పెట్రోలు పోసి నిప్పంటించింది. బాధితురాలు తన ఐదు నెలల కుమారుడిని ఎత్తుకొని ఉంది. ఈ ఘటనలో మమత అక్కడిక్కడే మృతి చెందగా.. చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాబును నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సగం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మమత భర్త నగేశ్ తో అదే గ్రామానికి చెందిన సుజాతకు వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోందని, మమత భర్త నగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని.. నిందితురాలు సుజాత పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Next Story
-
Home
-
Menu
