సర్జరీ చేస్తున్నప్పుడు ఆ కులం పేరు చెబితే ఇంజక్షన్ ఇవ్వరు.. ప్రమాదం తప్పుతుంది

ఆపరేషన్ చేసే ముందు మత్తుమందు డాక్టర్లు మీ కులం ఏమిటి అని అడుగుతారు? ఎందుకు అని అంటే వైశ్యులలో సూడో కొలినిస్టేరేజ్ అనగా బ్యుటిరైల్ కొలిస్టెరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివలన స్కొలిన్ అనబడే మజిల్ రిలాక్స్ చేసే మందు మత్తుమందు ఇచ్చే అప్పుడు ఇచ్చినట్లైతే రికవరీ కావడం కష్టం అవుతుంది. వీళ్లలో ఈ స్కొలిన్ అవాయిడ్ చేసి వేరే మందు ఇస్తారు. ఈ సమస్య యూదులలో కూడా ఉంది.. ఇది జెనిటిక్ గా వచ్చిన సమస్య బహుశా చాలా కాలం మేనరిక వివాహాలు జరగడం వల్ల వచ్చి ఉండొచ్చు..
మనకు ఏదైనా కండరం కాంట్రాక్ట్ కావాలి అని అంటే అక్కడ న్యూరో మస్కులర్ జంక్షన్ దగ్గర కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఒక ఇంపల్స్ నర్వు నుంచి కండరానికి వెళ్లాలి అని అంటే అక్కడ అసిటైల్ కొలీన్ అనేది విడుదల అవుతుంది. అది రిసెప్టార్ లకు అతుక్కుపోగా కంట్రాక్షన్ వస్తుంది. విడుదల అవుతానే ఎక్కువగా ఉన్న ఎంజైమును కొలినిస్టరేజ్ అనే మరొక ఎంజైము విడగొట్టేస్తుంది. అప్పుడు అప్పటికీ ఒక ఇంపల్స్ అయిపోతుంది. ఇది మామూలుగా జరుగుతుంది.
స్కొలిన్ అనే ఈ మత్తుమందు ఆ రిసెప్టార్లకు అతుక్కుపోతుంది. దీనిని విడగొట్టాలి అని అంటే రక్తంలో ఉండే సూడో కొలినెస్టరేజ్ ఎంజైమ్ చాలా ముఖ్యం. ఇది తక్కువగా ఉన్న యూదులు, వైశ్యులలో ఆ రిలాక్సేషన్ పోదు అందువలన ఎక్కువసేపు మజిల్ పెరాలిసిస్ లో ఉండిపోతుంది. దీనివలన వాళ్లకు ఊపిరి ఆడడం కష్టమవుతుంది. దీనికి పరిష్కారం చాలా సేపు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. అందుకని ఈ తరహా మజిల్ రిలాక్సన్ట్స్ వారిలో వాడకుండా వేరే అధునాతనమైన మందులను వాడుతారు.
ఇప్పుడు సిసిఎంబి సైంటిస్టులు జెనెటిక్ విధానం పరీక్షల ద్వారా ఈ ఎంజైమ్ వైశ్యులలో నిజంగానే తక్కువగా ఉంది అని నిర్ధారించారు. కానీ ఈ పద్ధతిని వైద్యశాస్త్రంలో ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. కావున మీరు వైశ్యులు అయితే మీరు జనరల్ అనస్తీసియాలో మత్తుమందు ఇస్తారు అని తెలిస్తే వెంటనే మీ కులాన్ని చెప్పడం చాలా ఇంపార్టెంట్ దాని వలన మీకు ఆ స్కొలిన్ అనే ఇంజక్షన్ ఇవ్వరు..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
-
Home
-
Menu
