నిన్న భార్య.... ఇవాళ భర్త మృతి

నిన్న భార్య.... ఇవాళ భర్త మృతి
X

ఆదిలాబాద్: భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో భర్త మనోవేధనతో ఒక్క రోజులోనే చనిపోయాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిట్టలవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నవీన్ కుమార్(33) అనే వ్యక్త ఆదిలాబాద్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత కొన్ని రోజుల నుంచి అతడు ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటూ భార్య లతతో కలిసి ఉంటున్నాడు. ఈ దంపతులకు పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్య నైతం లత(31) నెల రోజుల నుంచి పచ్చకామెర్ల వ్యాధితో ఇబ్బంది పడుతోంది. జగిత్యాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఆమె శనివారం చనిపోయింది. భార్య అంత్యక్రియలు చేసిన మరుసటి రోజు నవీన్ తుది శ్వాస విడిచారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో బాలుడు ఒంటరిగా మిగిలిపోయాడు. దీంతో బంధువులు స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Next Story