బడ్జెట్ ఓ అవకాశాల హైవే: పిఎం మోడీ

బడ్జెట్ చరిత్రాత్మకమైనది.140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేసి, వికసిత్ భారత్ కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందిస్తుంది. నిర్మల ప్రతిపాదించిన బడ్జెట్ ఓ అవకాశాల హైవే. బడ్జెట్ మహిళల బలం..శక్తివంతమైన ఉనికికి ప్రతిరూపం. ఈ బడ్జెట్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు కొత్త ఊపును ఇస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణానికి ఈ బడ్జెట్ పునాది. అదే విధంగా సంస్కరణలకు కొత్త శక్తిని, కొత్త వేగాన్ని ఇస్తుంది. ప్రపంచంలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులు కేవలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై సంతృప్తి చెందలేదు. త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేదుకు బడ్జెట్ దోహదకారిగా ఉంటుంది. ఈ బడ్జెట్ విశ్వాసం ఆధారిత పాలన, మానవ-కేంద్రీకృత ఆర్థిక చట్రం యొక్క దృక్పథాన్ని కలిగి ఉంది.
-
Home
-
Menu
