వందేమాతరానికి కాంగ్రెస్ ద్రోహం

న్యూఢిల్లీ: వందేమాతరం కేవలం ఒక గీతం కాదు. స్వాతంత్ర పోరాటంలో లక్షలాదిమందికి స్పూర్తిని చ్చిన మంత్రం అని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అన్నారు. బ్రిటీష్ ఆణచివేత ఉన్నప్పటికీ , వందేమాతరం స్వాతంత్ర యోధుల ఐక్యతను ప్రేరేపించిందని అన్నారు. అలాంటి వందేమాతరం పై మహాత్మగాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చిందని పిమర్శించారు. సామాజిక సామరస్యం ముసుగులో కాంగ్రెస్ జాతీయగీతం వందేమాతరం ను ముక్కలు చేసింది, ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలనే ఆ పార్టీ అనుసరిస్తోందని ప్రధాని దుమ్మెత్తిపోశారు. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్ సభలో జాతీయ గీతం పై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరంను ముస్లింలు విరోధించగలరనే సూచనతో ఏకీభవించిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు అప్పట్లో నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు రాసిన లేఖను కూడా ప్రధాని ఉదహరించారు.
లక్నోలో మహమ్మద్ అలీ జిన్నా నిరసన తర్వాత నెహ్రూ ఈ లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ గీతం నేపథ్యాన్ని తాను చదివానని, అది ముస్లింలలో కోపాన్ని రేకెత్తించవచ్చని తాను అభిప్రాయపడినట్లు నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. ఆ తర్వాత బంకిం చంద్ర చటర్జీ గీతం వందేమాతరం జాతీయ గీతంగా వాడే అంశంపై కాంగ్రెస్ ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసిందని మోదీ గుర్తు చేశారు. కానీ, 1937 అక్టోబర్ 26న కాంగ్రెస్ వందేమాతరం విషయంలో రాజీ పడింది. సామాజిక సామరస్యం అనే ముగుసులో వారు గీతాన్ని ముక్కలు చేశారు.ఇందుకు చరిత్ర సాక్షిగా నిలిచింది అని ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వర్గాలను సంతృప్తి పరచే రాజకీయాల ఒత్తిడిలో వందేమాతరం గీతాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని. అందుకే దేశ విభజన డిమాండ్ కు కూడా కాంగ్రెస్ తలొగ్గిందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ముస్లింలీగ్ ముందు మోకరిల్లిందని, ఒత్తిడిలో ఇలాచేసింది అనడానికి చరిత్ర నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేటికీ అదే బుజ్జగింపు రాజకీయాలను కొనసాగిస్తోందని మోదీ అన్నప్పుడు ట్రెజరీ బెంచ్ లు చప్పట్లతో దద్దరిల్లాయి.వందేమాతరం ఎంత ప్రజాదరణ పొందింది అంటే. అధిజాతీయగీతంగా అవతరించిందని మహాత్మగాంధీ ప్రధానికి రాసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. మరి ఆ మహా గీతానికి అన్యాయం ఎందుకు జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వందేమాతరం వందేళ్లు.. ఎమర్జెన్సీ
జాతీయగీతం వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ... రాజ్యాంగం అణచివేతకు గురయ్యిందని, దేశంలో అత్యవసరపరిస్థితిలో బందీ అయిందని మోదీ విచారం వ్యక్తం చేశారు. బ్రిటీష్ హయంలో ఎంతటి అణచివేత ఉన్నా.. వందేమాతరం శిలమాదిరిగా చెక్కు చెదర కుండా, స్వాతంత్ర సమర యోధులకు ఐక్యతా స్ఫూర్తిగా నిలించిందని ఆయన గుర్తు చేశారు. మన దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయం. ఆ సమయంలో రాజ్యాంగాన్ని తొక్కి పెట్టారు. దేశం కోసం త్యాగం చేసిన దేశ భక్తులను, దేశభక్తితో జీవించిన వారిని జైలులో పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం మనకు ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చు కోకూడదని తాను నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వందేమాతరం భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిని, శక్తిని ఇచ్చి, ధైర్యం, దృఢ సంకల్పం అనే మార్గాలను చూపింది ఈ రోజు పవిత్రమైన వందేమాతరం గీతాన్ని గుర్తు చేసుకోవడం మనందరికీ గొప్పగౌరవం అన్నారు ప్రధాని. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా మనం ఈ మహా మంత్రాన్ని గుర్తు చేసుగోవడం మనకు గర్వకారణం అని ప్రధాని ఉద్ఘాటించారు.
-
Home
-
Menu
