ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు.. సామాజిక మార్పుపై దృష్టి పెట్టండి: పిఎం మోడీ

ఓటు బ్యాంకు రాజకీయాలపై దృష్టి పెట్టకుండా సామాజిక సంస్కరణలు, సమాజంలో సానుకూల మార్పు కోసం కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారణాసి నుంచి వాద్‌నగర్ వరకు కొనసాగుతున్న ‘సేవా యాత్ర’లో పాల్గొంటున్న వారితో శుక్రవారం వర్చువల్‌గా ఆయన మాట్లాడారు.గత 12 ఏళ్లలో భారత్‌లో నగరాలు, గ్రామాల మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని మోడీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఎంతో మెరుగు పడ్డాయని, మహిళల స్వావలంబన కూడా పెరిగిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జీవితాన్ని పరిశీలిస్తే.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన గొప్ప సామాజిక సంస్కర్త కూడా. సమాజంలో ఉన్న అనేక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారు.
అందువల్ల రాజకీయ కార్యకర్తలమైన మనం కూడా ఓటు బ్యాంకుల గురించి ఆలోచించకుండా సామాజిక సంస్కరణలు, సానుకూల మార్పు కోసం పనిచేయాలి. సమాజానికి సేవ చేసేవారి సేవకు తగిన గౌరవం లభించాలి అని మోదీ అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టిన వారిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. వారి కృషి వల్ల కుంభమేళాకు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, తద్వారా భారత్ గౌరవం మరింత పెరిగిందని పేర్కొన్నారు. భారత్ గౌరవాన్ని ఇంతగా పెంచిన వారి పాదాలను కడిగి, వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని నాకు అనిపించింది అని మోదీ తెలిపారు.తన జీవితంలో ‘సేవా యాత్ర’కు ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రధాని చెప్పారు. దేశంలో తాను సందర్శించని జిల్లా దాదాపుగా లేదని, అనేక జిల్లాల్లో రాత్రి బస చేసే అవకాశం కూడా తనకు లభించిందని పేర్కొన్నారు.
-
Home
-
Menu
