24 గంటల్లోనే కూకట్‌పల్లి కేసును ఛేదించిన పోలీసులు

24 గంటల్లోనే కూకట్‌పల్లి కేసును ఛేదించిన పోలీసులు
X

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కూకట్ పల్లి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను శంషాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. కూకట్‌పల్లిలో మెట్రో పిల్లర్ 837 వద్ద ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై వెళ్తుండగా నలుగుగురు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం పొడి చల్లి కోటి రూపాయల విలువల గల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బహదూర్‌పూరాకు చెందిన ఎండి ఖస్రూ, ఎండి ఖైసర్ అనే వ్యక్తులు బంగారం బ్యాగ్‌తో ఎపి 12 విజి 1207 అనే నంబర్ గల స్కూటీపై రాత్రి పది గంటల సమయంలో వెళ్తున్నారు. కూకట్‌పల్లిలో మెట్రో పిల్లర్ 837 వద్దకు రాగానే ఖస్రూ, ఖైసర్ కళ్లలో గుర్తు తెలియని నలుగులు వ్యక్తులు కారం పొడి చల్లారు. అనంతం వాళ్ల చేతిలో ఉన్న బంగారం ఉన్న బ్యాగ్‌ను లాక్కొని రెండు బైక్‌లపై పారిపోయారు. వెంటనే ఖస్రూ, ఖైసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి శంషాబాద్ లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Tags

Next Story