పోలీస్ స్టేషన్ లో కాస్ట్ లీ ఫోన్ ను దొంగలించిన పోలీస్ డ్రైవర్

పోలీస్ స్టేషన్ లో కాస్ట్ లీ ఫోన్ ను దొంగలించిన పోలీస్ డ్రైవర్
X

హైదరాబాద్: పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిన సంఘటన హైదరాబాద్ లోని మెహదీపట్నంలో జరిగింది. లాకర్ లో పెట్టిన కాస్ట్ లీ ఫోన్ ను పోలీస్ డ్రైవర్ కొట్టేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సిసి కెమెరాల ఆధారంగా దొంగను పోలీసులు పట్టుకుని ఫోన్ ను రికవరీ చేశారు. అనంతరం రూ.1.75 లక్షల విలువగల ఫోన్ ను లాకర్లో దాచి పెట్టారు. కాస్ట్ లీ ఫోన్ కావడంతో దానిని పోలీస్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ ఎత్తుకెళ్లాడు. శ్రవణ్ కుమార్ దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నారు. శ్రవణ్ కుమార్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని అతడిని ఉన్నతాధికారులు రిమాండ్ కు తరలించారు.

Tags

Next Story