భూత్పూర్ లో హైవేపై హైటెక్ పోలీస్ దందా!

భూత్పూర్ లో హైవేపై హైటెక్ పోలీస్ దందా!
X

పేబ్బేరు సంతకెళ్లే వాహనాల నుంచి బలవంతపు వసూళ్లు, ప్రతి శనివారం వేలల్లో అక్రమ వసూళ్లు

కట్టెలు పట్టుకొని దౌర్జన్యకాండ ప్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ? భూత్పూర్ పోలీస్ మార్క్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : అదో 167 బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి.. ఇక్కడ ప్రతి రోజు వేలల్లో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇంత వరకు బాగానే ఉంది. వాహనాలను తనఖీ చేయాలన్నా, అధిక లోడులను తనఖీ చేయాలన్నా... అందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్‌టిఎ శాఖను ఏర్పాటు చేసింది. కాని ఇక్కడ వచ్చి న చిక్కంతా ఆర్‌టిఏ అధికారులు చేయాల్సిన పనిని పోలీసులు చేస్తే త ప్పేంటనా మీ అనుమానం.. కరెక్టే తప్పలేదు కాని లాఠీ పట్టుకొని మరీ వసూళ్లు చేయడంపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇం తకు వారు ఒరిజనల్ పోలీసులా? లేక నకిలీ పోలీసులు అన్నది తెలియ డం లేదు. ఒక నకిలీ పోలీసులు అయితే భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది ఈ దందా సాగుతుంటే అక్కడే ఉన్న పోలీసులకు ఎం దుకు తెలియక పోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ప్రెండ్లీ పోలీసింగ్ విధానం అంటున్న ప్రభుత్వం ఈ తరహా పోలీసుల వసూల పర్వంపై చెడ్డపేరు వచ్చే అవకాశాలు లేక పోలేదు. జిల్లా ఎస్‌పి జానకి కూడా ఎప్పటికప్పుడు శాంతి బద్రతల పర్యవేక్షణ చేపడుతూ మంచి అధికారిణిగా పేరు తెచ్చుకున్న తరుణంలో ఈ తరహా దందా పోలీసు శాఖను అప్రతిష్ట చేసే అవకాశం ఉంది.

కాసులు కురిపిస్తున్న పెబ్బేరు సంత

పెబ్బేరు సంత ఉమ్మడి జిల్లాతో రాష్ట్రంలోనే పెద్ద సంతల్లో ఇది ఒకటి. ఇ క్కడ ప్రతి పశువుతో పాటు అన్నిరకాల మార్కెట్ పెద్ద ఎత్తున సాగుతుం ది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తుంటారు. ప్రభుత్వంతో పాటు స్థానిక మున్సిపాల్టీతో కూడా ఆ ర్థిక ఆదాయాన్ని కల్పిస్తుంది. ఇక్కడ నుంచి వేలాది పశువులు, ఆవులు, గేదెలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటాయి. అదునుగా భావించిన పో లీసులు ఈ తరహా దందాకు తెరలేపారు.పేరుకు తనఖీల పేరుతో అక్రమంగా లక్షలు వెనుకేసుకుంటున్నారు.

ప్రతి శనివారం పైసా వసూల్

ప్రతి శనివారం ఒక్క హైదరాబాద్ నుంచి పెబ్బేరు సంతకు 200 నుంచి 300 పైగా పశువులు, గేదెలు, గొర్రెలు, వంటి పశువులు వాహనాలు వె ళ్తుంటాయి. తిరుగు ప్రయాణం చేస్తుంటారు. భూత్పూర్ సమీపంలో పోలీసులు ప్రవేట్ వాహనం నిలుపుకొని ఒక కానిస్టేబుల్‌తో లాఠీ పట్టించి పైసా వసూల్‌కు పాల్పడుతున్నారు. ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి పోవాలి కాదూ కూడదు అంటే అంతకు పదింతలు జరిమాన విధి స్తాం అంటూ దబాయిస్తున్నారని పేరు వెల్లడించలేని వాహన డ్రైవర్ మ న తెలంగాణకు చెప్పారు. వాహన పేపర్లు అన్ని కర్టెక్‌గా ఉన్నాయి చెప్పినప్పటికీ బండిని అక్రమ పార్కింగ్ చేశావు జరిమాన కట్టు అని బయపెడ్తున్నారని వాపోయాడు. నిజానికి పేపర్లు తనఖీ చేయాల్సిన పని అర్‌టిఏ శాఖది. కాని వారిపై ప్రేమనో ఏమో కాని వారి డ్యూటి పోలీసులు చేయడం వెనుక మతలబు ఏమిటో వారికే తెలియాలి. ఈ దందా వారానికి లక్షకు పైగా అంటే నెలకు లక్షల్లోనే ఉంటుందని తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉళ్లంగిస్తే ఎలా అన్న ప్రశ్న వస్తోంది. పోలీసులు అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. పోలీసుల్లో అనేక మంది మంచి వాళ్లు ఉన్నారు. కాని కొందరు పోలీసులు చీడ పురుగుల్లా మారడంతో శాఖకే చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా వసూల్ రాయళ్లపై కఠిన చర్యలు తీ సుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. లేక పోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Next Story