భువనగిరిలో రాజకీయ రగడ

బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

ఎంఎల్‌ఎ అనిల్ కుమార్‌రెడ్డి క్యాంప్

ఆఫీస్‌పై బిజెపి కార్యకర్తల దాడి, ఫర్నీచర్

ధ్వంసం దీంతో బిజెపి కార్యాలయం

ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులు

అడ్డుకున్న పోలీసులు, తోపులాట,

రాళ్లదాడి

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా భగ్గుమంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం కావడం, అనంతరం బీజేపీ కార్యాలయం వద్ద ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పే దశకు చేరింది.

బీజేపీ ఆందోళనతో మొదలైన రగడ

సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంతో పాటు బీజేపీ నాయకుడి ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి తోపాటు ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయల ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోకి వెళ్లిన బీజేపీ నాయకులు కుర్చీలు, పూల కుండీలు, అద్దాలు ధ్వంసం చేసి, రాళ్లు రువ్వారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.



ప్రతిదాడితో మరింత ఉద్రిక్తత

దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వైపు కదలడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా.. కొద్దిసేపటికే పరస్పరం రాళ్లతో దాడులకు దిగినట్లు సమాచారం. నల్లగొండ రోడ్డులోని బీజేపీ కార్యాలయం తో పాటు నడ్డిబొడ్డున్న ప్రీన్స్ చౌరస్తా, (వినాయక) అంబేద్కర్ చౌరస్తా పరిసరాలు ఒక్కసారిగా రణరంగాన్ని తలపించాయి.



భారీగా మోహరించిన పోలీసులు

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, భువనగిరి పట్టణ సీఐ రమేష్ తోపాటు పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల ఆందోళనలు, నినాదాలు, రాస్తారోకోలతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

దాడులు రాజకీయ సంస్కృతి కాదు :

ఎమ్మెల్యే కుంభం

సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు, నిరసనలు చేపట్టాలి తప్ప భౌతిక దాడులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ పేర్కొన్నారు. కాగ జిల్లా కేంద్రంలో ఇరు పార్టీల ఘర్షణలతో భువనగిరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయ విభేదాలు భౌతిక దాడుల దాకా వెళ్లడంపై పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.



బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు

మనతెలంగాణ/తార్నాక: రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవహరిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. న ల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్, ఆయన కు టుంబంపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. హర్షిత్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్టు చేయడం ఆప్రజాస్వామికమన్నారు.



ఎలాగైనా నల్గొండ వె ళ్లాలని ప్రయత్నించగా రామచందర్‌రావును పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.గృహ నిర్బంధాలు, అరెస్టులతో ప్రజాస్వామ్య ఉద్యమాలు ఆగవని స్పష్టం చేశారు.


Next Story