మంజీరాలో నురగలు

మంజీరాలో నురగలు
X

మంజీరానది జలాలు కాలకూట విషంగా మారుతున్నాయి. ఈ ప్రాంత పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నక్కవాగులోకి వదులుతున్నారు. ఈ వాగు ద్వారా కలుషిత జలాలు నేరుగా మంజీరా నదికి చేరుతున్నాయి. దీంతో మంజీరా నది కాలుష్యపు నురగలతో నిండిపోతోంది. చౌటకూర్ వద్ద దుర్వాసనతో కూడిన నురగలు కొండలను తలపిస్తున్నాయి. కాలుష్యాన్ని చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పశుపోషకులు నదిలో నీటిని పశువులకు తాగించేందుకు, వాటిని శుభ్రం చేసేందుకు జంకుతున్నారు. పోతే ప్రజల ప్రాణాలే” కదా.. అన్న నిర్లక్ష్యం పరిశ్రమ నిర్వాహకుల్లో, కాలుష్య నియంత్రణ అధికారుల్లోనూ నెలకొందని ప్రజలు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి పరిశ్రమ నిర్వాహకుల ఆగడాలను అరికట్టి.. మంజీరాను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Next Story