మహిళలకు చీరలు పంచిన పొన్నం ప్రభాకర్

X
కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టీ చీర (సారే) అందించడం జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేనందున ఇవాళ చైర్మన్ నిర్మల జయరాజ్ ,కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీ కి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది.
Tags
Next Story
-
Home
-
Menu
