ఎస్ఐఆర్‌పై చర్చకు బిజెపి ఎందుకు వెనుకడుగు వేస్తోంది? పొన్నం

ఎస్ఐఆర్‌పై చర్చకు బిజెపి ఎందుకు వెనుకడుగు వేస్తోంది? పొన్నం
X

మన తెలంగాణ – హైదరాబాద్: ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలపై బిజెపి సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు బిజెపి బాధ్యత వహించాలని అన్నారు. ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బిజెపికి ఉందా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు, ఎన్నికల డేటాలో మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రత వంటి అంశాలపై బిజెపి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఎస్ఐఆర్‌పై చర్చించేందుకు బిజెపి ఎందుకు వెనుకాడుతోందని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.

దేశంలోకి చొరబాట్లు జరగకుండా కేంద్ర హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని, చొరబాటుదారులు ఓటర్లుగా ఎలా మారుతున్నారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 ఏళ్లలో ఏం చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యాత్రలు చేపట్టడం సిగ్గుచేటని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Tags

Next Story