గీకురు రవీందర్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: పొన్నం

గీకురు రవీందర్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: పొన్నం
X

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, చిగురుమామిడి మండల మాజీ జడ్ పి టిసి గీకురు రవీందర్ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. రవీందర్ మృతి తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రవీందర్ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన అందించిన సేవలను, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ఈ విషాద సమయంలో రవీందర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు. వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రవీందర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పొన్నం స్పష్టం చేశారు.

Tags

Next Story