అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. స్వాగతించిన మంత్రి పొన్నం..

అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. స్వాగతించిన మంత్రి పొన్నం..
X

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు.. లోక్‌సభలో ఆమోదం పొందడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఎపి ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వివక్ష చూపుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

‘‘బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి హామీలను ఇప్పటివరకూ నెరవేర్చలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందు పరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని పొన్నం డిమాండ్ చేశారు.

Tags

Next Story