బాలికలు స్నానం చేస్తుండగా చిత్రీకరణ.. వార్డెన్‌పై పోక్సో కేసు

బాలికలు స్నానం చేస్తుండగా చిత్రీకరణ.. వార్డెన్‌పై పోక్సో కేసు
X

ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్‌ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.ఆనందరావు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఇటీవల షీ టీమ్ అవగాహన కార్యక్రమం పాఠశాలలో జరిగింది. అప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు సేకరించిన సిటీ పోలీసులు .. బేల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అతడిని రిమాండ్‌కు తరలించారు. తాజాగా అతడిని విధుల నుంచి బహిష్కరిస్తూ.. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంజాజీ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Next Story