వధువు భావాలను అందంగా చూపించే పాట

డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్, -డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. బుధవారం సెకండ్ సింగిల్ ’బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ లేటెస్ట్ సింగిల్‌ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్‌ను ఫ్రెష్‌గా, ఫన్‌తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను ఈ పాట అందంగా చూపిస్తోంది. సంగీత దర్శకుడు స్వీకర్ ట్రెండీ బీట్స్‌తో పాటు ఫెస్టివ్ ఫ్లేవర్‌ను అద్భుతంగా మేళవించారు. ఈ పాటలో ఫరియా స్క్రీన్‌పై మెరిసింది. చివరలో తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చి, తనదైన ఫన్ వైబ్‌తో ఈ సెలబ్రేషన్‌ను మరింత డబుల్ చేశారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
-
Home
-
Menu
