జపాన్‌లో భూకంపం.. ప్రభాస్ పరిస్థితి ఎలా ఉంది..

Prabhas
X

‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం డిసెంబర్12వ తేదీన జపాన్‌లో విడుదల కానుంది. 2015లో వచ్చిన బాహుబలి 1, 2017లో బాహుబలి 2 చిత్రాలను కలిపి బాహుబలి: ది ఎపిక్‌ని రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. కాగా, జపాన్‌ ఉత్తర తీరంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఎలా ఉన్నారని.. అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభాస్ పరిస్థితి గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. దర్శకుడు మారుతి వీటికి రిప్లే ఇచ్చారు.

‘జపాన్‌లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం రిటర్న్ అవుతాడా?’ అని ఓ అభిమాని మారుతిని అడిగాడు. దీనికి స్పందిస్తూ ‘ఇప్పుడే ప్రభాస్‌తో మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని సమాధానం ఇచ్చారు. కాగా ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’ . ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. జపాన్ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

Tags

Next Story