నల్లగొండలో గణపతి మండపంలో పూజారి మృతి

X
At Vinayaka mandapam electrical precautions
తిరుమలగిరిసాగర్: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో వినాయక చవితి సందర్భంగ పూజా చేస్తూ అకస్మాత్తుగా పూజారి దుర్మరణం చెందాడు. చింతలపాలెం గ్రామంలోని రామాలయం దగ్గర వినాయక మండపంలో ఉప్పల దత్తు ప్రసాద్ అనే పూజారి పూజలు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్య తమ మండపం వద్ద పూజా చేయాలని ప్రసాద్‌ను అడ్డుకున్నారు. గ్రామ పెద్దలు పూజారికి నచ్చజెప్పి గుండాల రవి గణేశ్ మండపం వద్దకు తీసుకెళ్లారు. దత్తు ప్రసాద్ వినాయక మంత్రాలు చదువతుండగా అకస్మాత్తుగా కూలపడిపోయాడు. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ప్రసాద్ కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
