మునిగిన శివాలయం... మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం

మునిగిన శివాలయం... మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం
X

హైదరాబాద్‌: మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పొంగిప్రవహిస్తోంది. 30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహం ఉందని అధికారులు వెల్లడించారు. మూసీ వరద తాకిడికి శివుడి దేవాలయం మునిగిపోయింది. వరద పొటెత్తడంతో శివాలయం పైనే పూజారి కుటుంబం తలదాచుకుంది. సహాయం కోసం శివాలయం పైకెక్కి పూజారి ఆర్తనాదాలు చేస్తోంది. పురానాపూల్‌ వద్ద స్మశానవాటిక నీటిలో మునిగిపోయింది. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ లోకి వరద నీరు చేరడంతో జాతిపిత సమాధి మునిగిపోయింది.

భారీ వర్షాలు కురవడంతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ ఘాట్ లోయర్‌ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. చాదరఘాట్ వద్ద చిన్ని బ్రిడ్జి వరద ప్రవాహంలో మునిగిపోయింది. ఎంజిబిఎస్ లో మోకాల్లోతు వరద ప్రవహిస్తుంది రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షానికి హైదరాబాద్‌ విలవిలలాడిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మూసీ ఉధృతితో పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.









Tags

Next Story