గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు

గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు
X

మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదలించారు. ఈకార్యక్రమానికి ముందుగా సమ్మక్క- సారలమ్మ గద్దెల వ ద్ద పసుపు, కుంకుమ, సారా అరగించి పూజలు చేశారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయి తర్వాత గద్దెలపై ఎఎధ్వజ స్తంబాలను ప్రతిష్టించనున్నారు. ఈనెల 24న గోవిందరాజు, పగిడిద్దరాజు నూతనంగా నిర్మిస్తున్న గద్దెలపై ధ్వజ స్థంబాలను ప్రతిష్టించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేష్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్థన్, పూజారులు పాల్గొన్నారు.

Tags

Next Story