డిజిటల్‌ యుగంలోనూ.. భారత్‌లో ప్రింట్‌ మీడియా జోరు!

print media increased in Digital media
X

print media increased in Digital media

పాశ్చాత్య దేశాల్లో డిజిటల్‌ మీడియా దెబ్బకు ప్రింట్‌ పత్రికలు కష్టాల్లో పడుతుంటే.. భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఐఆర్ఎస్ 2019 గణాంకాలు ఏం చెబుతున్నాయంటే

12 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 33 మందికి పైగా పత్రిక చదువుతున్నారు.

మొత్తం ప్రింట్‌ పాఠకులు 42.5 కోట్లు.

దినపత్రికల పాఠకులు 40 కోట్లకు పైగా.

ప్రాంతీయ భాషల పత్రికలు – 21.1 కోట్లు

హిందీ పత్రికలు – 18.6 కోట్లు

ఇంగ్లిష్‌ పత్రికలు – 3.1 కోట్లు

అంటే ఇంగ్లిష్‌ పత్రికల కంటే ప్రాంతీయ భాషల పత్రికల పాఠకులు దాదాపు 7 రెట్లు ఎక్కువ ఉంది.

ఎందుకు?

ప్రజల భాషలో వార్తలు.. స్థానిక సమస్యలకు ప్రాధాన్యం.. తక్కువ ధర.. ఇంటి తలుపు దగ్గరకే పత్రిక రావడం గమనార్హం. డిజిటల్‌ ఎంత పెరిగినా.. భాష + స్థానికత + విశ్వసనీయత ఉన్నంతకాలం భారత ప్రింట్‌ మీడియాకు బలం ఉంటుంది

Tags

Next Story