గద్వాల్ లో డివైడర్ను ఢీకొని దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు

X
మన తెలంగాణ / ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో లక్ష్మీదేవి (60) అనే మహిళకు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను ఉండవెల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బస్సులోని మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Next Story
-
Home
-
Menu
