కామారెడ్డి లో ప్రైవేటు బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

X
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం తప్పింది. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వద్ద అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ నియంత్రణ డ్రమ్ములను బస్సు ఢీకొట్టింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బిక్కనూరు పోలీసులు డ్రైవర్ మద్యం సేవించినట్లుగా నిర్థారించారు. డైవర్ ను అదుపులోకి తీసుకొని బస్సును సీజ్ చేశారు. బెంగళూరు వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story
-
Home
-
Menu
