విద్యార్థి తండ్రిపై రాడ్‌తో దాడి చేసిన ప్రైవేట్ స్కూల్ సిబ్బంది

విద్యార్థి తండ్రిపై రాడ్‌తో దాడి చేసిన ప్రైవేట్ స్కూల్ సిబ్బంది
X

సూర్యాపేట: ఒక్క ఆటోలో 25 మంది పిల్లలను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించినందుకు విద్యార్థి తండ్రిపై స్కూల్ సిబ్బంది దాడి చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉండ్రుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని స్వామినారయణ్ గురుకుల అనే ప్రైవేటు పాఠశాలకు తండ్రి తన కుమారుడు తీసుకొని వచ్చాడు. ఒక్క ఆటోలో 25 మంది పిల్లలను ఎక్కించడంతో స్కూల్ యాజమానిని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి ఆగ్రహంతో ఊగిపోయిన సిబ్బంది విద్యార్థి తండ్రిపై రాడ్‌తో దాడి చేశారు. అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story