లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి
X

నేరెడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండలంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడడంతో రిమ్స్ కు తరలించారు. ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి యూపిలోని గోరఖ్ పూర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

Tags

Next Story