భూత్పూర్ లో బోల్తాపడిన బస్సు: 20 మందికి గాయాలు

X
భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో 20మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 36 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ నాగన్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. అతివేగంతో పాటు డ్రైవర్ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Next Story
-
Home
-
Menu
