నాని ‘ది ప్యారడైజ్’లో సర్‌ప్రైజ్.. కెసిఆర్ పాత్రలో ప్రియదర్శి

X
నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఈ సినిమాలో అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ప్రియదర్శి.. ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో నటించారు. అయితే ఆయన పాత్ర మాజీ సిఎం కెసిఆర్‌ను పోలి ఉంది. కెసిఆర్ ప్రసంగాలను పోలిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా హావభావాలతో ప్రియదర్శి ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ యాసలో ఇరగదీశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
