సీఈసీపై దేశద్రోహం కేసు పెట్టాలి: ప్రియాంక గాంధీ

సీఈసీపై దేశద్రోహం కేసు పెట్టాలి: ప్రియాంక గాంధీ
X

దేశంలోని సుమారు 13 కోట్ల మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ‘అన్యాయమైన ఎన్నికలు’ జరిగేందుకు అనుమతించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ‘దోశద్రోహం’ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. గురవారంనాడు వయనాడ్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియతో ఎవరు చెలగాటమాడినా అది దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహానికి పాల్పడటమేనని అన్నారు. ‘ఇది మా స్పష్టమైన వైఖరి,

ఒకవేళ ఎన్నికల కమిషన్ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే సీఈసీకి రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, అందులో నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, దేశానికి వ్యతిరేకంగా జరిగిన నేరపూరిత చర్య అని అన్నారు. ఇతర నేరస్థుల మాదిరిగానే సీఈసీపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని, ఆయనపై దేశద్రోహం కేసులో విచారణ జరగాలని, కఠినంగా శిక్షించాలని అన్నారు.

Tags

Next Story