ఫ్యాన్స్‌కి ‘మిరాయ్’ దసరా గిఫ్ట్.. టికెట్ ధరల్లో డిస్కౌంట్

ఫ్యాన్స్‌కి ‘మిరాయ్’ దసరా గిఫ్ట్.. టికెట్ ధరల్లో డిస్కౌంట్
X

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. ఫాంటసీ సినిమాగా కార్తీక్ ఘటమనేని ఈ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.140 కోట్లు వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో సినిమాను మరికొంత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను తగ్గించింది.

‘‘ఈ దసరాను మీ కుటుంబం, పిల్లలతో కలిసి ‘మిరాయ్’ సినిమా థియేటర్‌లో జరుపుకోండి. సింగిల్‌ స్క్రీన్‌లో అతి తక్కువ ధరకు మూవీని ఆస్వాదించండి’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో బాల్కనీ టికెట్ ధర రూ.150గా, ఫస్ట్‌ క్లాస్ టికెట్ ధర రూ.105గా నిర్ణయించింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజా నిర్ణయంతో మరింత మంది ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags

Next Story