ఓట్ల దొంగలను కాపాడుతున్నారు..

ఓట్ల దొంగలను కాపాడుతున్నారు..
X

ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం జంతర్ మంతర్ సమీపంలో నిర్వహించిన పౌరుల మార్చ్‌లో ఉద్రిక్తతల తలెత్తింది. పలపువురు సామాజిక కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియంలో భాగంగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లు తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సాధారణ పౌరులు కూడా ఈ నిరసలో పాల్గొన్నారు.జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, ఆమె సహచరుల నినాదాలతో ఆందోళన ప్రారంభమైంది. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్లందరినీ తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, దీపాంకర్ భట్టాచార్య,

నందితా నారాయణ్ వంటి కార్యకర్తలు మీడియాతో మాట్లాడారు. అనంతరం వారు జంతర్ మంతర్ రోడ్డుపై మార్చ్‌గా ముందుకు సాగారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని మార్చ్‌కు అనుమతి లేదని తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నట్టు రైటైర్డ్ ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ నందితా నారాయణ్ తెలిపారు. నిరసనకారులను బస్సులో తరలిస్తుండగా ఫుట్‌బోర్డ్ నుంచి యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులు తమను అదుపులోకి తీసుకుని ‘ఓట్ల దొంగలను’ కాపాడుతున్నారని ఆరోపించారు. ఆయనతో పాటు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, పారదర్శకత కార్యకర్త అంజలి భరద్వాజ్, నేహా బోరా, పలువురు యువ కార్యకర్తలను ఢిల్లీ కంటోన్మెంట్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags

Next Story