వలలో చిక్కిన కొండచిలువ

X
python was caught in a fishing net
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పెద్ద చెరువు మత్తడి నీటి వద్ద చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో కొండచిలువ సోమవారం చిక్కింది. భారీ వర్షాలతో సుల్తానాబాద్ ఊర చెరువు మత్తడి నుండి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ నీటి ప్రవాహంలో చేపలు బయటకు వెళ్లిపోతాయని ఉద్దేశంతో మత్స్యకారులు ప్లాస్టిక్ జాలీని మత్తడి నీటికి అడ్డంగా ఏర్పాటు చేశారు. ఈ ప్లాస్టిక్ కొండచిలువ వలలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మత్స్యకారులు వలను బయటకు తీయడంతో అందులో చిక్కుకొని ఉన్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలాంటి కొండచిలువ పాములు ఇంకా ఈ పెద్ద చెరువు నీటిలో ఎన్ని ఉన్నాయోనని మత్స్యకారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టుబడిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించేందుకు సమాచారం అందించారు.
Next Story
-
Home
-
Menu
