ప్రేమ... బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

X
మేడ్చల్ మల్కాజ్‌గిరి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకాపరం... గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి సూరారంలోని శివాలయం నగర్‌లో ఉంటున్నాడు. ప్రసాద్‌కు కుమారుడు అభిలాష్, కూతురు ఉన్నారు. బౌరంపేటలోని డిఆర్‌కె కాలేజీలో అభిలాష్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ యువతిని అభిలాష్ గాఢంగా ప్రేమించాడు. ఆరు నెలల క్రితం మరో యువకుడితో ఆమె పెళ్లి చేశారు. అప్పటి నుంచి మానసికంగా ప్రసాద్ కుంగిపోయాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
