రాహుల్‌ది అరాచక మనస్తత్వం: నితిన్ నబిన్

రాహుల్‌ది అరాచక మనస్తత్వం: నితిన్ నబిన్
X

వారణాసి: ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం నిరసన సాగించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గురువారం తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీది అరాచక మనస్తత్వం అని , సమాజంలో విషం వ్యాపింప చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై ఆయనకు అభ్యంతరాలుంటే కేరళలో ఇదే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించిందని, అలాగే తమిళనాడులో కూడా ఇదే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించిందని పేర్కొన్నారు. రాహుల్‌కు దమ్ముంటే ఆయన ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.“ వివిధ ప్రాంతాల నుంచి భారత దేశానికి వచ్చి ప్రజల హక్కులను హరించేవారిని వ్యతిరేకిస్తున్నాం.

దేశ వనరులు, సంపద, భూమిపై ప్రజలకు హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. ఈ హక్కులను చొరబాటు దారులు క్లెయిమ్ చేయడానికి మేము అనుమతించం” అని ఆయన అన్నారు. విదేశీ మనస్తత్వం ఉన్న ప్రజలను భారత దేశంలో స్థిరపడేలా చేసే ప్రయత్నాలను బీజేపీ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని నబిన్ పేర్కొన్నారు. అంతకు ముందు కాశీ విశ్వనాథ ఆలయంలో ఆయన ప్రార్థనలు చేశారు. ఆలయ కారిడార్ నిర్మాణం పట్ల ప్రధాని మోడీని, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. బీజేపీ ఎన్నికల సన్నాహాల గురించి అడగ్గా, పార్టీ కార్యకర్తలు రేయింబవళ్లు పనిచేస్తారని పేర్కొన్నారు.

Tags

Next Story