ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ ఘటన.. తల్లిదండ్రులకు అండగా రాహుల్ గాంధీ

ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ ఘటన.. తల్లిదండ్రులకు అండగా రాహుల్ గాంధీ
X

ముంబై: ఐఐటీ బాంబేలో చదువుతూ మరణించిన విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సాహిల్ పేరెంట్స్ రవీంద్ర, సోనాలి వాకోడేలకు రాహుల్ గాంధీ వీడియో కాల్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయ. ఈ సందర్భంగా తమ కుమారుడికి న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని, సాధ్యమైనంత సహాయం చేస్తామని రాహుల్ గాంధీ సాహిల్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారని పేర్కొన్నాయి. గురువారం ఐఐటీ బాంబే గేటు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు విద్యార్థి సాహిల్ తల్లిదండ్రులు ప్రకటించారు.

కాగా, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రెండవ సంవత్సరం బీటెక్ చదువుతున్న 22 ఏళ్ల సాహిల్, సెప్టెంబర్ 18 సాయంత్రం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించాడు. మిడ్-సెమిస్టర్ పరీక్ష సమయంలో చాట్‌జీపీటీని ఉపయోగించడానికి మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబడిన కొద్ది గంటలకే ఈ ఘటన జరిగింది. తాను కులపరమైన దూషణలను ఎదుర్కొన్నట్లు సాహిల్ తమతో చెప్పాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు.

Tags

Next Story