రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..

రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..
X

ముంబై: భారతీయ చిత్రకారుల్లో రాజా రవివర్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పెయింటింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. తాజాగా రవివర్మ పెయింటింగ్ ఒకటి రికార్డు ధరకు అమ్ముడు పోయింది. యశోద, కృష్ణులు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడు పోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్‌ ఆక్షన్‌ను నిర్వహించారు.

ఈ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్‌ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన దీన్ని రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సాధించింది. తాజాగా ఈ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టింది. ఈ పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని.. ఇది తన కర్తవ్యం అని సైరస్ మీడియాతో అన్నారు.

Tags

Next Story