రజనీ సూపర్‌హిట్ సినిమాకి సీక్వెల్.. టైటిల్ ఏంటంటే..

Narasimha Movie
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలు ఎన్నో సూపర్‌హిట్‌గా నిలిచాయి. అందులో ‘నరసింహ’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1999లో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో రజనీ భార్య వసుంధరగా దివంగత నటి సౌందర్య నటించగా.. రమ్యకృష్ణ నటించిన ‘నీలాంబరి’ అనే పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికీ ‘నీలాంబరి’ పాత్ర చిరస్థాయిలో నిలిచిపోయింది. అయితే త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రానుందని రజనీ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

డిసెంబర్ 12న రజనీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘నరసింహ’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీని ప్రచారంలో భాగంగా రజనీ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. అందులో ఈ సినిమా సీక్వెల్‌ను ప్రకటించారు. ‘‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలుకొట్టి థియేటర్లలోకి వచ్చి చూసిన సినిమా ‘నరసింహా’. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నాం. ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. 2.0 (రోబో సీక్వెల్), జైలర్ 2 చేసేప్పుడు ఈ ఆలోచన వచ్చింది. రెండో భాగాన్ని ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో మీకు అందిస్తాం. ప్రస్తుతం దీని స్టోరీపై చర్చలు నడుస్తున్నాయి’’ అని రజనీకాంత్ చెప్పారు.

Tags

Next Story