అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర

Amaravati
X

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.

Tags

Next Story