కవలలు పుట్టిన వేళ.. రామ్ చరణ్ రెట్టింపు ఆనందం

హైదరాబాద్: హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. శనివారం ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈ సందర్భంగా మెగా కాంపౌండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి శనివారం రాత్రే ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ విషయంపై రామ్ చరణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. రెట్టింపు ఆనందంతో ఓ పోస్ట్ పెట్టారు. ఉపాసన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప పుట్టారని తెలుపుటకు ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే అత్యంత బలం. ఎప్పుడూ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్’’ అంటూ చరణ్ పేర్కొన్నారు.
-
Home
-
Menu
