కవల పిల్లలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు

X
హైదరాబాద్: సినీ నటుడు రామ్ చరణ్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉపాసన బాబు, పాప జన్మనిచ్చారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, తన కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం అనేది తాత నానమ్మలుగా మాకు చాలా ఆనందంగా ఉందని, ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు తాము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాంచరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో రాంచరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఎఐ ఫొటో
Tags
Next Story
-
Home
-
Menu
